: ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపిన సైన్యం


జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారాలోని కల్రూస్ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారం అందుకున్న భద్రతాదళాలు... ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటినీ జల్లెడ పట్టాయి. ఈ క్రమంలో, ఓ ఇంటి నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆ ఇంటిని చుట్టుముట్టిన బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరంతా లష్కరే తాయిబా ఉగ్రసంస్థకు చెందినవారని భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News