: ఉత్తరప్రదేశ్ లో కుప్పకూలిన చేతక్ హెలికాప్టర్


ఉత్తరప్రదేశ్ లో హెలికాప్టర్ కూలిన ఘటన చోటుచేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన పైలట్లకు శిక్షణ ఇస్తున్న సమయంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఓ బహుళ అంతస్తుల భవనానికి దగ్గర్లో ఈ హెలికాప్టర్ కూలింది. కాగా, ఆ భవనంపై కూలినా, లేక భవనానికి ఢీ కొట్టినా భారీ నష్టం వాటిల్లి ఉండేదని తెలుస్తోంది.

నిర్మానుష్య ప్రదేశంలో హెలికాప్టర్ కుప్పకూలడంతో ఇతరులెవరూ గాయపడలేదని తెలుస్తోంది. కాగా, ఈ చేతక్ హెలికాప్టర్ లో ఎంత మంది శిక్షణ తీసుకుంటున్నారు? వారిలో ఎంత మంది గాయపడ్డారు? ఎంత మంది సురక్షితంగా ఉన్నారు? అన్న వివరాలు తెలియాల్సిఉంది. హెలికాప్టర్ కూలడంతో స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోగా, హెలికాప్టర్ పరిసరాలకు చేరుకున్న పోలీసులు ఎవరినీ దాని దరిదాపులకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. 

  • Loading...

More Telugu News