: అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపే అర్హత శశికళకు లేదు: విరుచుకుపడ్డ పన్నీర్ సెల్వం
జయలలిత మృతి తరువాత తమిళనాడులోని అధికార అన్నాడీఎంకేలో విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో పళనిస్వామి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఆ పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజక వర్గానికి వచ్చేనెల 12న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అన్నాడీఎంకే నుంచి దినకరన్‌ను అభ్యర్థిగా ప్రకటించిన అంశంపై పన్నీర్ సెల్వం విమర్శలు చేశారు. ఆ పార్టీ తరపున అభ్యర్థులను నిలిపే అర్హత శశికళకు లేదని అన్నారు. ఆయనను ఎన్నికల కమిషన్ అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అన్నాడీఎంకే పార్టీకి, దినకరన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.