: చంద్ర‌బాబుకి హామీలు గుర్తుండాలంటే పచ్చబొట్టు పొడిపించుకోవాలేమో!: రోజా


అధికారంలోకి రాక‌ముందు చంద్ర‌బాబు నాయుడు చేసిన హామీలను ఇప్పుడు మరచిపోయారని, ఆయ‌న గ‌జినీ అయిపోయార‌ని, హామీలు అలాగే గుర్తుండిపోవాలంటే పచ్చబొట్టు పొడిపించుకోవాలేమో అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని చెప్పిన ప్ర‌భుత్వం వ‌ద్ద డ‌బ్బులు లేవు కానీ వైసీపీ ఎమ్మెల్యేలను కొనడానికి మాత్రం ఉన్నాయా? అని ఆమె వ్యాఖ్యానించారు. మహిళలు, శిశువులు, వృద్ధులు, వికలాంగులకు బ‌డ్జెట్‌లో కేవ‌లం రూ.1,750 కోట్లే కేటాయించార‌ని ఆమె విమ‌ర్శించారు. ఆడంబ‌రంగా ఎన్నో కార్య‌క్ర‌మాల‌కి కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టే సీఎంకి చిన్నపిల్లల బాలామృతానికి డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నామంటున్నార‌ని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News