: ప్రపంచంలో ఏ ప్రాంతం కూడా పూర్తి అనుకూలంగా ఉండదు: అమరావతిపై గ్రీన్ ట్రైబ్యునల్ లో ఏపీ
నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపించారు. కొండవీటి వాగులో ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నామని ట్రైబ్యునల్ కు గంగూలీ తెలిపారు. ప్రపంచంలో ఏ ఒక్క ప్రాంతం కూడా వంద శాతం అనువుగా ఉండదని చెప్పారు. భూసేకరణ ద్వారా రైతుల నుంచి భూములను తీసుకుని, తిరిగి అభివృద్ధి చేసిన స్థలాలను కేటాయిస్తున్నామని తెలిపారు. ఏపీ వాదనలు విన్న ట్రైబ్యునల్ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.