: అర్ధరాత్రి వాడేం చేశాడో తెలుసా?: ట్విట్టర్ లో స్నేహితుడి గురించి సెహ్వాగ్


టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేస్తున్న ట్వీట్లు మంచి ఆదరణ పొందుతున్నాయి. తాజాగా తన స్నేహితుడు చేసిన ఓ పని గురించి సోషల్ మీడియాలో ప్రస్తావించి అందర్నీ నవ్వుల్లో ముంచెత్తాడు. 'మీ ఇంట్లో బ్రెడ్‌ ప్యాకెట్‌ మరో పావుగంటలో ఎక్స్‌ పైర్‌ అవుతుందా? ఆ విషయం మీకెవరికైనా తెలుసా? అయితే, మా స్నేహితుడు చేసినట్టు చేసుకోండి' అంటూ ట్వీట్ చేశాడు.

ఒకరోజు బోర్ కొడుతుండడంతో తన స్నేహితుడితో గడుపుదామని అతని ఇంటికెళ్లాడట. డిన్నర్ అయ్యాక ఆ రాత్రి నిద్రపోతుంటే 11:45 గంటల సమయంలో ఇంట్లోని వంట గదిలోంచి సెహ్వాగ్ కి ఏదో చప్పుడు వినిపించింది. ఏమిటా అని చెప్పి లేచి కిచెన్ లోకి వెళ్లానని, అయితే అక్కడ తన స్నేహితుడు చేస్తున్న పని చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు. అంత రాత్రి వేళ తన స్నేహితుడు బ్రెడ్ తింటూ కనిపించాడని అన్నాడు. దీంతో ఇంత రాత్రి వేళ బ్రెండ్ తింటున్నావేంట్రా? అని ప్రశ్నిస్తే... మరో పావుగంటలో ఈ బ్రెడ్ ఎక్స్ పెయిర్ అవుతుంది, అందుకే తినేస్తున్నానని సమాధానమిచ్చాడని చెప్పాడు. దీంతో తాను నవ్వాపుకోలేకపోయానని అన్నాడు. ఈ ట్వీట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. దీనిని చదివిన వారంతా కూడా నవ్వుకుంటున్నారు.

  • Loading...

More Telugu News