: ఏపీ కొత్త అసెంబ్లీ గేటు ముందు అలజడి.. యువతి ఆత్మహత్యాయత్నం
ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని అమరావతిలోని వెలగపూడి అసెంబ్లీ వద్ద ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. తనకు గత కొంతకాలంగా ఉన్నతాధికారులు వేతనం రాకుండా చేస్తున్నారంటూ ఆరోపిస్తూ కల్యాణి అనే ఆ యువతి సీఎం చంద్రబాబును కలిసేందుకు అక్కడికి వచ్చింది. అయితే, ఆమె లోపలికి ప్రవేశించేందుకు సిబ్బంది ఒప్పుకోలేదు. దీంతో తనతో తెచ్చుకున్న నిద్రమాత్రలు మింగి ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను అక్కడి సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆ యువతి గతంలోనూ ఇటువంటి ఘటనలకే పాల్పడిందని, పలుసార్లు ఇలాగే హంగామా చేసిందని తెలుస్తోంది.