: అనూహ్య పరిణామం.. ఐసీసీ చైర్మన్ పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా
వ్యక్తిగత కారణాలతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్ పదవికి శశాంక్ మనోహర్ గుడ్ బై చెప్పారు. కొంత కాలంగా భారత క్రికెట్ సంఘం (బీసీసీఐ) ఆయన తీరుపై ఆగ్రహంగా ఉంది. ఈ కారణంగానే ఆయన అర్థాంతరంగా తప్పుకున్నారని విశ్లేషకుల అభిప్రాయం. బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయన గతంలో రెండు సార్లు పని చేశారు. గత ఏడాది మేలో ఐసీసీ చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికై ఈ పదవి చేపట్టారు. దీంతో తొలి ఇండిపెండెంట్ చైర్మన్‌గా కూడా ఆయనే నిలిచారు. ఆయన పదవీ కాలం వచ్చేనెల మే వరకు ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.