: మణిపూర్‌ బయల్దేరిన అమిత్‌ షా విమానంలో సాంకేతిక సమస్య.. ఢిల్లీకి మళ్లింపు!


మణిపూర్‌ ముఖ్యమంత్రిగా బీరెన్‌ సింగ్‌ ప్రమాణస్వీకారానికి బ‌య‌లుదేరిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా విమానంలో సాంకేతిక సమస్య త‌లెత్తింది. దీంతో ఆ విమానాన్ని మ‌ళ్లీ డిల్లీకి మళ్లించడంతో బీరెన్‌ సింగ్‌ ప్రమాణస్వీకారోత్సవ కార్య‌క్ర‌మానికి అమిత్ షా హాజ‌రుకాలేక‌పోతున్నారు. ఇటీవ‌ల వెలువ‌డిన‌ మ‌ణిపూర్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగ‌ర్‌ను అందుకోన‌ప్ప‌టికీ, బీజేపీ ఇతర సభ్యుల మద్దతుతో తన సంఖ్యను 32కు పెంచుకుంది. నిన్న ఆ రాష్ట్ర‌ గ‌వ‌ర్న‌ర్ న‌జ్మా హెప్తుల్లాకు ఆ రాష్ట్ర బీజేపీ తన మ‌ద్ద‌తుదారుల లేఖను స‌మ‌ర్పించ‌డంతో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీని ఆమె ఆహ్వానించారు. ఈ క్రమంలో బీజేపీ అభ్య‌ర్థి బీరెన్‌ సింగ్ మ‌రికాసేప‌ట్లో ఆ రాష్ట్ర‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు.

  • Loading...

More Telugu News