: జీరో సైజా... అది నావల్ల కాదు బాబూ!: రాశీ ఖన్నా


‘నేను నా జీన్స్ పరిమాణమంత కూడా లేను. నా చిరు నవ్వంతే ఉన్నాను. నేను మీరు కోరుకున్నట్టు ఉండేదాన్ని కాదు. నేను నాలానే ఉంటాను’ ప్రముఖ బాలీవుడ్ కథానాయిక రాశీ ఖన్నా రాసిన కవితలోనివి ఈ వాక్యాలు. తాను అప్పుడప్పుడు ఇలాంటి రచనలు చేస్తుంటానని రాశీ ఖన్నా ఓ ప్రముఖ పత్రికకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది.

‘‘ఆడవారి అందంలో ప్రమాణాలను నిర్దేశించరాదు. ఒకరికి అందంగా అనిపించినది మరొకరికి అనిపించకపోవచ్చు. అందంకోసం కష్టపడడం అన్నది హాస్యాస్పదం. ఒకే ఒక వ్యక్తి మనల్ని అందంగా చూడాలనుకుంటారు. అది మనమే. నేను బరువు తగ్గకముందు ‘మీరు కొన్ని కిలోలు తగ్గాలండీ’ అని అనే వారు. తగ్గిన తరవాత ఇంతకుముందు కంటే చక్కగా కనిపిస్తున్నారని అంటున్నారు. ప్రజలకు ఎప్పుడూ అభిప్రాయాలు ఉంటుంటాయి. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక నేను బరువు తగ్గలేదు. నా అంతట నేను కోరుకోవడం వల్లే అది సాధ్యమైంది. ఆరోగ్యంగా ఫిట్ గా ఉండాలన్నది నా ఆలోచన. నేను జీరో సైజు కావాలని కోరుకోవడం లేదు. అది నావల్ల కాదు. నేను కోరుకున్నా గానీ అయ్యే పని కాదు’’ అని ఆమె వివరించింది.

‘‘అమ్మాయిలు అందరూ తెలుసుకోవాల్సింది ఒకటుంది. మీ గురించి ఏదైనా గొప్పగా చేయాలనుకుంటే చేయండి. బరువు తగ్గాలనుకుంటే ప్రయత్నించండి. కానీ, సరైన మార్గంలోనే చేయండి. మీరు కోరుకుంటేనే చేయండి. మీరు బాగుంటారంటూ ఎవరో చెప్పే మాటల కోసం చేయకండి’’ అంటూ అమ్మాయిలందరికీ రాశీ ఖన్నా సూచన కూడా చేసింది.


  • Loading...

More Telugu News