: యూపీ సీఎం రేసులో నేను లేను!: రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ


ఇటీవ‌ల నిర్వ‌హించిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఘ‌న‌విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా బీజేపీ అధిష్ఠానం ఎవ‌రిని ఎంపిక చేస్తుందన్న అంశంపై ఆస‌క్తి నెల‌కొంది. అందులో ప్ర‌ధానంగా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేరు వినిపించింది. ఈ వార్త‌ల‌పై తాజాగా రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. యూపీ సీఎం రేసులో తాను ఉన్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండిస్తూ.. అవ‌న్నీ ఉత్త పుకార్లేన‌ని, తాను రేసులో లేనని చెప్పారు. కాగా, ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి అంశంపై రేపు తుది నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు బీజేపీ అధిష్ఠానం తెలిపింది.

  • Loading...

More Telugu News