: విమానంలో హెడ్ఫోన్స్ పేలి.. కాలిపోయిన మహిళ మొహం
బీజింగ్ నుంచి మెల్బోర్న్ వెళుతున్న ఓ విమానంలో ఓ మహిళ హెడ్ఫోన్స్ పెట్టుకొని నిద్రపోతోంది. అయితే, ఒక్కసారిగా అవి పేలిపోవడంతో సదరు మహిళ మొహం కాలింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. హెడ్ఫోన్స్ పేలడంలో నిద్రలేచి చూసిన ఆ మహిళ... తన చెవికున్న హెడ్ఫోన్స్ నుంచి మంటలు, పొగలు వ్యాపిస్తుండడాన్ని గ్రహించి వెంటనే వాటిని తీసి పడేసింది.
అయితే, అప్పటికే మొహము, చేతులు నల్లగా కాలిపోయాయి. తాను విషయాన్ని తొందరగా గుర్తించి స్పందించి ఉండకపోతే తన మెడ కూడా మొత్తం కాలిపోయుండేదని ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన సిబ్బంది మంటలు వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకున్నారు.