: ఏపీ బడ్జెట్ రూ.1,56,999 కోట్లు.. అభివృద్ధే లక్ష్యంగా దూసుకుపోతాం: యనమల
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ రూ.1,56,999 కోట్లని తెలిపారు. రెవెన్యూ రూ.1,25,911 కోట్లని చెప్పారు. నిర్వహణ వ్యయం కూ.31,087 కోట్లని, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.8,790 కోట్లని కేటాయిస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధే లక్ష్యంగా దూసుకుపోతామని చెప్పారు.
రాష్ట్రబడ్జెట్‌లో ఇతర అంశాలు:
* జలవనరులు, వరద నివారణకు రూ.701 కోట్లు
* రవాణాకు రూ.1,677 కోట్లు
* సాధారణ విద్యకు రూ.19,897 కోట్లు
* సాంకేతిక విద్యకు రూ.728 కోట్లు
* వైద్య, ఆరోగ్య శాఖకు రూ.6,574 కోట్లు
* తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యానికి రూ.1,049 కోట్లు
* ఎస్టీల సంక్షేమానికి రూ.3,528 కోట్లు
* నీటిపారుదలకు రూ.12,770 కోట్లు
* ఇప్పటివరకు రైతు రుణమాఫీకి చెల్లించింది రూ.11 వేల కోట్లు
* రుణమాఫీ తదుపరి చెల్లింపునకు రూ.3,600 కోట్లు
* సామాజిక భద్రత, సంక్షేమ పింఛన్లకు రూ.1,636 కోట్లు
* సంక్షేమ శాఖకు రూ.1,234 కోట్లు
* సాంస్కృతిక శాఖకు రూ.78 కోట్లు
* క్రీడలు, యువజన సర్వీసుల శాఖకు రూ.728 కోట్లు
* కాపు కార్పొరేషన్ కు రూ. 1000 కోట్లు
* బ్రాహ్మణ కార్పొరేషన్ కు రూ. 75 కోట్లు
* క్రైస్తవ కార్పొరేషన్ కు రూ. 35 కోట్లు
* ఎన్టీఆర్ క్యాంటీన్ల పథకానికి రూ. 200 కోట్లు
* ఐటీ శాఖకు రూ. 364 కోట్లు