: తిండిబట్టే సంతాన యోగ్యం.. వీర్యకణాల ఆరోగ్యం.. తాజా పరిశోధనలో వెల్లడి


మనం తీసుకునే ఆహారమే వీర్యకణాల ఆరోగ్యాన్ని, సంతాన సౌభాగ్యాన్ని నిర్ణయిస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. వీర్య కణాలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే పండ్లు, తాజా కూరగాయలు, తృణధాన్యాలు, చేపలు, కొవ్వు సమృద్ధిగా ఉండే మెడిటెర్రేనియన్ వంటి ఆహారాన్ని తీసుకోవాలని అధ్యయనవేత్తలు చెబుతున్నారు. ‘వీర్యకణ నాణ్యత, పురుషుడి పునరుత్పత్తి రేటు-పోషకాహారం’పై స్పెయిన్‌లోని రొవిరా-ఐ-వర్జిలి యూనివర్సిటీ, పెరి-ఐ-వర్జిలి ఆరోగ్య పరిశోధన సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా వంధ్యత్వం పెద్ద సమస్యగా పరిణమించిందని, ఇది 15 శాతం మంది దంపతులపై ప్రభావం చూపుతోందని పరిశోధకులు పేర్కొన్నారు.

పురుషుల్లో వీర్య కణాల నాణ్యత స్వల్పంగా ఉండడం వల్ల 25 శాతం మంది సంతానహీనులవుతున్నారని తెలిపారు. పీతలు, ఆల్చిప్పలు, చేపలు వంటి సముద్రపు ఆహారంతోపాటు కోళ్లు, కోడిగుడ్లు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, వెన్నతీసిన పాలు, కొవ్వు తక్కువగా ఉండే డెయిరీ ఉత్పత్తులు తీసుకోవడం వల్ల వీర్యకణాల నాణ్యత పెరుగుతుందని వారు పేర్కొన్నారు. అలాగే శుద్ధిచేసిన ఆహారం, బంగాళాదుంపలు, సోయా ఉత్పత్తులు, జున్ను, మద్యం, వెన్న ఎక్కువగా ఉండే డెయిరీ ఉత్పత్తులు, కాఫీ, తీయగా ఉండే పానీయాలు, స్వీట్లు తినేవారిలో వీర్యకణ నాణ్యత తక్కువగా ఉంటుందని అధ్యయనకారులు వివరించారు.

  • Loading...

More Telugu News