: కోడిపుంజు గుర్తు కోసం దీప పట్టు.. అది ‘అమ్మ’ సెంటిమెంట్ అట!


జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావిస్తున్న జయ మేనకోడలు దీప తనకు కోడిపుంజు గుర్తును కేటాయించాలని ఈసీని అభ్యర్థించనున్నారు. ఒకవేళ అది కాకుంటే చేప, త్రాసు, శ్రామికుల చేయి గుర్తులలో ఏదో ఒకదాని కోసం పట్టుబట్టాలని నిర్ణయించుకున్నారు.

వచ్చే నెల 12న ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో  కోడిపుంజు గుర్తు కోసం దీప గట్టి పట్టుదలతో ఉన్నారు. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీఆర్ మరణానంతరం పార్టీలో చీలిక ఏర్పడింది. దీంతో అప్పుడు జయ వర్గానికి ఈసీ కోడిపుంజు గుర్తును కేటాయించింది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో ఆ గుర్తును దక్కించుకునేందుకు దీప ప్రయత్నిస్తున్నట్టు 'దీప పేరవై' పార్టీ నేతలు పేర్కొన్నారు. మరోవైపు అన్నాడీఎంకే రెండుగా చీలిపోవడంతో ఆ పార్టీ రెండాకుల గుర్తును ఈసీ ఎవరికి కేటాయిస్తుందోనని అటు శశికళ వర్గం, ఇటు పన్నీర్ వర్గం టెన్షన్‌గా ఎదురుచూస్తున్నాయి.

  • Loading...

More Telugu News