: రూ.4కోట్లకు పైగా 'రద్దయిన పెద్ద నోట్లు' స్వాధీనం


కోల్‌కతా పోలీసులు పెద్ద మొత్తంలో రద్దయిన పెద్దనోట్లను స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారంతో నగరంలోని లీ రోడ్‌లోని అశోక్ సూరన్ అనే వ్యాపారి ఇంటిపై దాడిచేసిన పోలీసులు అతడి నుంచి రూ.4 కోట్లకు పైగా రద్దయిన పెద్ద నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో 50,160 రూ.500 నోట్లు, 16,427 రూ.1000 నోట్లు ఉన్నాయి. ఆ సొమ్మును వ్యాపారంలో సంపాదించానని చెబుతున్న అశోక్ అందుకు తగిన ఆధారాలు చూపించడంలో విఫలమయ్యారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన మరో ఘటనలో రెండుకార్లలో తరలిస్తున్న రూ.26.28 లక్షల విలువైన రూ.500, రూ.1000 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News