: కేటీఆర్ ఓ బచ్చా.. రాహుల్‌ని అనే స్థాయా అతనిది?.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి నిప్పులు చెరిగారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లోని తాయిలాలను చూస్తుంటే ప్రభుత్వం మధ్యంతర ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోందన్నారు. బడ్జెట్ ప్రసంగాల్లోనూ తప్పుడు వాగ్దానాలు చేయడం టీఆర్ఎస్కు అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. మంత్రి కేటీఆర్ బచ్చా అని, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని విమర్శించే అర్హత, స్థాయి అతనికి లేవన్నారు. అసలాయనకు క్యారెక్టరే లేదన్నారు. అమెరికా నుంచి హఠాత్తుగా ఊడిపడిన కేటీఆర్‌కు త్యాగాల చరిత్ర కలిగిన గాంధీ కుటుంబాన్ని, రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి లేదన్నారు.