: వైఎస్సార్ దూకుడుగా వెళ్లినా ఆలోచించేవారు.. జగన్‌లో ఆ తెలివి లోపించింది!: చంద్రబాబు


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కొంత దూకుడుగా ముందుకు పోయినా ఎవరైనా చెబితే ఇంకోసారి ఆలోచించేవారని, వైసీపీ అధినేత జగన్‌లో అది లోపించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. మంగళవారం సభ ముగిసిన తర్వాత టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. జగన్ వ్యవహారశైలిపై అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ లాంటి ప్రతిపక్షం దొరకడం అదృష్టమో, దురదృష్టమో అర్థం కావడం లేదన్నారు. తోటి శాసనసభ్యుడు చనిపోతే సంతాపం తెలిపేందుకు అసెంబ్లీకి రారని, సంతాప తీర్మానంలో పాల్గొనేందుకు ఆయన కుమార్తె వస్తే తప్పు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తామెప్పుడూ ఇలా చేయలేదని, మానసిక స్థిరత్వం కోల్పోయినప్పుడే ఇటువంటి చేష్టలకు దిగుతుంటారని ముఖ్యమంత్రి విమర్శించారు.

  • Loading...

More Telugu News