: ఆర్థిక పరిస్థితులు కాదు.. వేరే ఏవైనా కావచ్చు!: జయసుధ భర్త మృతిపై మోహన్ బాబు స్పందన


ప్రముఖ నటి జయసుధ భర్త మృతిపై  సీనియర్ నటుడు మోహన్ బాబు స్పందించారు. ‘నాకు దాదాపు నలభై ఐదు సంవత్సరాల నుంచి జయసుధ తెలుసు.. నేను, మూడు వందల రూపాయలకు అసోసియేట్ డైరెక్టర్ గా పని చేస్తున్నప్పుడు.. ఆమె హీరోయిన్ గా పని చేసింది... ఆ తర్వాత అదే జయసుధ పక్కన హీరోగా నటించాను... ఆమె మహానటి. మా గురువు గారు దర్శకుడు దాసరి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా నితిన్ కపూర్ పనిచేశాడు. బాలీవుడ్ నటుడు జితేంద్రకు కజిన్. నితిన్ కపూర్ కు నూటికి నూరు మార్కులు వేస్తాను... కరెక్టుగా నాలుగు రోజుల క్రితం మా ఇంటికి వచ్చి భోజనం చేశాడు. ఆరోగ్యం ఎలా ఉందని అడిగాను...ఆర్థిక పరిస్థితులు కాదు.. వేరే ఏవైనా కావచ్చు. అతని మనసులో ఏదో ఉండొచ్చు.. ఆ కుటుంబానికి నా సంతాపం’ అని మోహన్ బాబు తన ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News