: జయసుధ భర్త ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు: ముంబై పోలీసులు


ప్రముఖ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ముంబైలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సందర్భంగా ముంబై పోలీసులు మాట్లాడుతూ, నితిన్ కపూర్ కొంత కాలంగా డిప్రెషన్ లో ఉన్నారని చెప్పారు. ఏడాదిన్నరగా సైకియాట్రిస్టు దగ్గర చికిత్స పొందుతున్నారని తెలిపారు. ముంబైలోని తన సోదరి ఇంట్లో ఉంటున్న నితిన్ కపూర్, ఈ రోజు మధ్యాహ్నం 1.45 గంటలకు ఆరో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పారు.

 

  • Loading...

More Telugu News