: ఆర్థిక పరిస్థితుల కారణంగానే జయసుధ భర్త మృతి!


 ప్రముఖ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ మృతికి కారణం ఆయన ఆర్థిక పరిస్థితులేనని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో కొన్ని హిందీ చిత్రాల్లో ఆయన పెట్టుబడులు పెట్టారని, అందుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలే ఆయన మృతికి దారి తీసి ఉండవచ్చని చెబుతున్నారు. కొంతకాలంగా నితిన్ డిప్రెషన్ లో ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా, నితిన్ కపూర్ కు కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు లేవని, కేవలం, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగానే ఇంత తీవ్రమైన నిర్ణయాన్ని నితిన్  ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.  

  • Loading...

More Telugu News