: 45 రోజుల్లో 4 సెకన్లకో ఫోన్ చొప్పున అమ్ముడు పోయింది!


చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ ఉత్పత్తుల సంస్థ షియోమీ భారత్‌ లో వ్యాపారాన్ని విస్తరించుకుంటోంది. భారతీయుల అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లో ప్రవేశపెడుతూ అమ్మకాల సునామీ సృష్టిస్తోంది. తాజాగా మూడు వేరియంట్లలో మార్కెట్ లో ప్రవేశపెట్టిన షియోమీ రెడ్‌మీ నోట్‌ 4 ఫోన్లు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. కేవలం 45 రోజుల్లో పది లక్షల ఫోన్లు అమ్ముడయ్యాయని షియోమీ ప్రకటించింది. జనవరి 23న భారత్ లో విడుదలైన రెడ్‌ మీ నోట్‌ 4 ఆన్ లైన్ వేదికగా మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. భారత మార్కెట్లో పది లక్షల అమ్మకాల మార్కును అత్యంత వేగంగా అందుకున్న స్మార్ట్ ఫోన్ గా ఇది చరిత్ర పుటలకెక్కింది. 45 రోజుల్లో ప్రతి నాలుగు సెకన్లకు ఒక ఫోన్‌ చొప్పున షియోమీ నోట్ 4 స్మార్ట్ ఫోన్ అమ్ముడుపోయిందని ఈ సంస్థ తెలిపింది. 

  • Loading...

More Telugu News