: షార్ట్ ఫిలిం దర్శకుడికి బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన కౌశిక్
వివాదాస్పదమైన ‘సీత.. ఐయామ్ నాట్ వర్జిన్’ టైటిల్‌తో షార్ట్ ఫిలింను తీసిన దర్శకుడు కౌశిక్ బాబుపై ఇప్పటికే కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే, తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ కౌశిక్ బాబు ఈ రోజు సీసీఎస్ డీసీపీ మహంతిని ఆశ్రయించాడు. సామాజిక మాధ్యమాల్లో తనపై అభ్యంతరక పోస్టులు పెడుతున్నారని, బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశాడు.