: అబ్బాయిల్లా అమ్మాయిలు జుట్టు కత్తిరించుకోవటం, డ్రెస్ వేసుకోవటం చేస్తే ఆ వర్సిటీ నుంచి బహిష్కరణే!
సౌదీ అరేబియాలోని మహ్మద్ బిన్ సౌద్ ఇస్లామిక్ యూనివర్సిటీ తమ విద్యార్థినులకు పలు హెచ్చరికలు చేసింది. అమ్మాయిలు స్టైలుగా జుట్టు కత్తిరించుకున్నా, అబ్బాయిల్లా డ్రెస్ వేసుకున్నా వర్సిటీ నుంచి బహిష్కరిస్తామని చెప్పింది. సౌదీలో స్త్రీ, పురుషులకు వేర్వేరు చట్టాలు అమలవుతున్నాయి. అమ్మాయిలు జుట్టు పొట్టిగా కత్తిరించుకుని కనపడడాన్ని సంప్రదాయ ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. అలాగే విద్యాలయాల్లో అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరు భవనాల్లో చదువు చెబుతారు. యూనివర్సిటీలు మినహా మిగతా అన్ని స్థాయి విద్యా సంస్థల్లోనూ అమ్మాయిలకు మహిళా ఉపాధ్యాయులే బోధన చేస్తారు. ఇక యూనివర్సిటీల్లో పురుష ప్రొఫెసర్లు బోధించే సమయంలో విద్యార్థినులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఆయన ప్రత్యక్షంగా కనబడకుండా పార్టిషన్‌లో ఉంచుతారు.