: నేనింతే...'దంగల్' కు అవార్డు వచ్చినా ఫంక్షన్ కు వెళ్లను!: అమీర్ ఖాన్


అవార్డు ఫంక్షన్లకు వెళ్లనని బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తెలిపాడు. నేడు తన పుట్టిన రోజు సందర్భంగా కేక్ కోసి మీడియాతో మాట్లాడిన అమీర్ ఖాన్, నిన్న రాత్రి 12 గంటలకే నిద్రపోయానని చెప్పాడు. తెల్లారి లేచి చూసేసరికి తన ఫోన్ శుభాకాంక్షల మెసేజ్ లతో నిండిపోయిందని అన్నాడు. తనకు ఎవరూ పుట్టినరోజు బహుమతి ఇవ్వలేదని చెప్పాడు. కనీసం మీడియా ప్రతినిధులైనా ఇస్తే తీసుకోవాలని ఉందని అమీర్ చమత్కరించాడు. అవార్డు ఫంక్షన్లపై తనలో ఎలాంటి మార్పు రాలేదని అన్నాడు. తాను అవార్డు ఫంక్షన్లకు వెళ్లనని స్పష్టం చేశాడు.

'దంగల్' సినిమాకు అవార్డు వచ్చినా వెళ్లేది లేదని తేల్చిచెప్పాడు. సినిమాలో పాత్ర కోసం ఎంత కష్టమైనా ఆనందంగా భరిస్తానని చెప్పాడు. షారూఖ్ ను రెండు రోజుల క్రితం కలిశానని చెప్పిన అమీర్ ఖాన్... తమ మధ్య సినిమాలకు సంబంధించిన సంభాషణ జరగదని అన్నాడు. ఇప్పుడు అమితాబ్ నుంచి నటనలో పాఠాలు నేర్చుకుంటున్నానని అమీర్ ఖాన్ చెప్పాడు. 'థగ్స్ ఆఫ్ హిందుస్థానీ' సినిమాలో వారిద్దరూ కలిసి నటిస్తున్నారు. 

  • Loading...

More Telugu News