: దేశంలో కోట్లాది మంది మత్తులో మునిగిపోతున్నారు.. వివరాలు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం


దేశంలో మత్తు పదార్థాలకు అలవాటుపడ్డవారి సంఖ్యను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వివ‌రించింది. ఈ విష‌యంపై 2000-01 కాలంలో చేపట్టిన సర్వే వివరాలను ఈ రోజు హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ అహిర్ ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా లిఖితపూర్వ‌కంగా తెలియజేశారు. దేశ వ్యాప్తంగా మద‍్యపానానికి 6.25 కోట్ల మంది, గంజాయికి 87 లక్షల మంది, నల్లమందు తీసుకోవ‌డానికి 20 లక్షల మంది బానిస‌లుగా మారార‌ని చెప్పారు. మొత్తానికి భార‌త్‌లో 7.32 కోట్ల మంది మాదక ద్రవ్యాలు, మద్యం తీసుకుంటున్నార‌ని చెప్పారు.

దేశంలో మ‌త్తు ప‌దార్థాలు తీసుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంద‌ని అన్నారు. గ‌త ఏడాది దేశ వ్యాప్తంగా చేపట్టిన త‌న‌ఖీల్లో 46,873 కిలోల మెథాక్వలోన్‌ అనే మత్తు పదార్థం ప‌ట్టుబ‌డినట్లు చెప్పారు. ఈ సోదాల్లో మొత్తం 8 మంది విదేశీయులతోపాటు 20 మందిని అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News