: అవినీతి ఆరోపణలు.. ఎర్రగడ్డ ఛాతీ వ్యాధుల ఆసుపత్రి సిబ్బందిపై వేటు
అవినీతి ఆరోపణల కేసులో ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆసుపత్రి సిబ్బందిపై వేటు పడింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిన్న ఆసుపత్రిలో చేరిన టీబీ రోగి ఒకరు మృతి చెందాడు. వార్డు బాయ్స్ ఇద్దరు రూ.150 లంచం అడిగారని, తాము ఇవ్వకపోవడంతో సదరు రోగికి ఆక్సిజన్ పెట్టకపోవడంతో మృతి చెందాడని మృతుడి బంధువులు ఆరోపిస్తూ, ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు.
కాగా, వార్డు బాయ్స్ ఇద్దరిపై ఫిర్యాదు చేస్తూ నిన్న రాత్రి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయి కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సంఘటనపై ఇద్దరు వార్డు బాయ్ లను సస్పెండ్ చేస్తున్నట్లు ఆసుపత్రి సూరింటెండెంట్ ప్రకటించారు. దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేశామని, నివేదిక అందిన తర్వాత మిగతా వారిపై చర్యలు తీసుకుంటామని, ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత లేదని ఆయన చెప్పారు.