: వచ్చే నెల 1 నుంచి ఐడియా మరో ఆఫర్!


మార్కెట్లో రిల‌య‌న్స్ జియో ఇచ్చిన పోటీతో ఇత‌ర టెలికాం కంపెనీల నుంచి కురుస్తోన్న ఆఫ‌ర్‌ల వ‌ర్షం కొన‌సాగుతోంది. తాజాగా
ఐడియా వ‌చ్చేనెల‌ 1 నుంచి దేశవ్యాప్తంగా ఇన్‌కమింగ్స్ కాల్స్‌ను ఫ్రీ రోమింగ్‌తో అందించనున్నట్లు పేర్కొంది. వాటితో పాటు పలు ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్స్‌ను కూడా త‌మ వినియోగ‌దారుల ముందుకు తీసుకొచ్చిన‌ట్లు తెలిపింది. రూ. 1199తో రీఛార్జ్ చేయించుకుంటే ఈ ప్రత్యేక రోమింగ్ ప్యాక్ ను పదిరోజుల వ్య‌వ‌ధితో అందిస్తున్న‌ట్లు తెలిపింది. ఇటీవ‌లే మిగ‌తా టెలికాం కంపెనీలు కూడా ఫ్రీ రోమింగ్ ను అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌లు చేసిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News