: వైఎస్సార్ నాపై వ్యక్తిగత దూషణలు కూడా చేశారు... అయినా ఆయ‌న‌ చనిపోయినప్పుడు జగన్ ను పరామర్శించా: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానంపై ఈ రోజు శాస‌న‌స‌భ్యులు మాట్లాడిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట్లాడుతూ సంతాప తీర్మాన సమయంలో ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభకు హాజరుకాకపోవడాన్ని తప్పుబట్టారు. గ‌తంలో శాస‌న‌సభలో దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి త‌న‌పై వ్యక్తిగత దూషణలు కూడా చేశారని అన్నారు. తనను వైఎస్సార్ ఎంత‌గా అవమానించినా ఆయ‌న‌ చనిపోయినప్పుడు ఇంటికి వెళ్లి జగన్‌ను పరామర్శించానని అన్నారు. అనంత‌రం అంత్య‌క్రియ‌ల‌కు ఇడుపులపాయకు బయల్దేరాన‌ని, అయితే ట్రాఫిక్‌ వల్ల వెళ్లలేకపోయానని చెప్పారు. అంతేకాకుండా పులివెందులలో విజయమ్మ పోటీ చేస్తే త‌మ‌ అభ్యర్థిని కూడా నిలబెట్టలేదని పేర్కొన్నారు. కాగా, వైసీపీ స‌భ్యులు మాత్రం సంప్ర‌దాయానికి వ్య‌తిరేకంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని అన్నారు.

  • Loading...

More Telugu News