: పవన్ కల్యాణ్ సినిమా 'జానీ' ఫ్లాప్ కావడానికి కారణాన్ని చెప్పిన రేణు దేశాయ్!


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా 'జానీ' సినిమా నిలిచిపోయింది. ఈ సినిమాకు పవన్ కల్యాణే దర్శకత్వం వహించారు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడానికి కారణమేంటో ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ తాజాగా వెల్లడించింది. ఒరిజినల్ కథ ప్రకారం సినిమా క్లైమాక్స్ లో హీరో చనిపోవాలట. కానీ, కమర్షియల్ హంగుల కోసం కథను మార్చేశారని రేణు తెలిపింది. దీనికితోడు కథలో చాలా మార్పులు చేశారని చెప్పింది. ఒరిజినల్ కథతో సినిమాను నిర్మించి ఉంటే... సినిమా హిట్ అయి ఉండేదని ఆమె తెలిపింది. ఈ సినిమాలో రేణు దేశాయే హీరోయిన్ అనే విషయం తెలిసిందే. భవిష్యత్తులో ఎప్పటికైనా ఒరిజినల్ కథతో 'జాని' సినిమాను తెరకెక్కిస్తానని రేణు చెప్పింది.

  • Loading...

More Telugu News