: మా అమ్మానాన్నలకు జగన్ ఇచ్చే గౌరవం ఇదేనా?: భూమా అఖిలప్రియ


అసెంబ్లీలో తన తండ్రి భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానానికి వైసీపీ అధినేత జగన్ రాకపోవడంపై భూమా అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి గురించి మాట్లాడాల్సి వస్తుందనే కారణంతో సభకు రాలేదని జగన్ చెప్పడాన్ని ఆమె తప్పుబట్టారు. వైసీపీలో ఉన్నప్పుడు ఆ పార్టీ కోసం తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పనిచేశారని చెప్పారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు తమ కుటుంబ సభ్యులను కూడా వదిలేసి... పార్టీ కోసం పని చేశారని గుర్తు చేశారు. అలాంటి తన తల్లిదండ్రులకు జగన్ ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వంతో ఇబ్బందులు ఉంటే అది వేరే విషయమని, కేవలం భూమా నాగిరెడ్డి గురించి మాట్లాడాల్సి వస్తుందనే కారణంతో సంతాప తీర్మానానికి రాకపోవడం చాలా దారుణమని చెప్పారు.  

  • Loading...

More Telugu News