: పశ్చిమబెంగాల్ హైకోర్టు జడ్జి కర్ణన్ కు మతి చెడింది.. కోర్టు ధిక్కార చర్యలకు క్షమాపణ చెప్పాలి: రామ్‌ జెఠ్మలానీ లేఖ


విచార‌ణ‌కు హాజ‌రుకాకుండా ఇటీవ‌లే కోర్టు ధిక్కార కేసులో అరెస్టు వారెంట్‌ అందుకున్న కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్ కర్ణన్‌పై ప్రముఖ న్యాయవాది రామ్‌ జెఠ్మలానీ మండిప‌డ్డారు. న్యాయ వ్యవస్థను నాశనం చేయొద్దని పేర్కొంటూ ఓ బహిరంగ లేఖను రాశారు. ఇటీవ‌ల నోటీసులు అందుకున్న సంద‌ర్భంగా క‌ర్ణ‌న్ చేసిన ప‌లు వ్యాఖ్య‌ల‌ని ప్ర‌స్తావిస్తూ న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన ప్రతి పదాన్ని ఆయ‌న‌ వెనక్కి తీసుకోవాలని లేఖ ద్వారా సూచించారు. అంతేగాక‌ కర్ణన్ కు మతి చెడిందని ఆయ‌న అందులో పేర్కొన్నారు. కోర్టు ధిక్కార చర్యలకు ఆయ‌న‌ క్షమాపణ చెప్పాలని అన్నారు. బార్ లో సీనియర్ సభ్యుడిగానే కాకుండా క‌ర్ణ‌న్ కంటే వయసులో పెద్దవాడిగా ఆయ‌న‌కో సలహా ఇస్తున్నానని జెఠ్మ‌లానీ పేర్కొన్నారు. క‌ర్ణ‌న్‌ పాల్పడ్డ తెలివిలేని చర్యలకు సవినయంగా క్షమాపణ కోరాల‌ని అన్నారు. ఆయ‌న‌కు పిచ్చి ఎంతగా ముదిరిపోయిందో తెలుసుకోలేక‌పోతే త‌న‌ను కలవాల‌ని అన్నారు.

  • Loading...

More Telugu News