: నన్ను అసెంబ్లీకి రమ్మని ఎవరూ పిలవలేదు... తమ్ముడిని, చెల్లిని అప్పగించి నేనే వచ్చాను: అఖిలప్రియ


"నేను ఈ రోజు చాలా గట్టి నిర్ణయం తీసుకుని ఇక్కడికి రావడం జరిగింది. అసెంబ్లీకి నన్ను రమ్మని చెప్పి ఎవరూ అడగలేదు అధ్యక్షా. కానీ, మా నాన్నగానీ, అమ్మగానీ నా పొజిషన్ లో ఉండి ఉంటే, ఇదే పని చేసేవారని అనుకొని నేను ఈ రోజు తమ్ముడిని, చెల్లెలినీ కుటుంబ సభ్యులకు అప్పగించి వచ్చాను. ఎందుకంటే, ఈ రోజు నాకున్న బాధ్యత ఇది. నా తల్లి, నా తండ్రి ఏ హామీలైతే ఇచ్చారో, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది.

కార్యకర్తలకు అండగా నిలుచోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడిప్పుడే కార్యకర్తలకు నాపై నమ్మకం పెరుగుతున్న వేళ, నాన్న బాధ్యత కూడా నాపై పడింది. నిన్నటి నుంచి నేను ఎక్కడా భయపడలేదు. అమ్మానాన్నా నాపై పెట్టిన బాధ్యత ఇది. నేను తప్పకుండా వాళ్ల అంచనాల మేరకు పని చేస్తాను" అని భూమా సంతాప తీర్మానం సందర్భంగా అఖిలప్రియ వ్యాఖ్యానించారు.
సహచర సభ్యులంతా మాట్లాడింది వింటుంటే నాపై బాధ్యత మరింతగా పెరిగినట్టు అనిపిస్తోందని చెప్పారు. ఆళ్లగడ్డతో పాటు నంద్యాల నియోజకవర్గాన్నీ తాను చూసుకుంటానని, ప్రజలకు అండగా నిలబడి ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి ప్రయత్నిస్తానని, భూమా నాగిరెడ్డి లేరన్న లోటును పూడ్చడానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News