: కొత్త అసెంబ్లీలో ఇలా మాట్లాడతానని కలలో కూడా అనుకోలేదు: అఖిలప్రియ
"ఇది మన కొత్త అసెంబ్లీ. ఎప్పుడెప్పుడు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలా అని నేనెంతో అనుకుంటూ ఉన్నాను అధ్యక్షా. కానీ, మొదటిసారి కొత్త అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారి గురించి మాట్లాడతానని నేనెప్పుడూ అనుకోలేదు. భూమా నాగిరెడ్డి గారు పుట్టినప్పటి నుంచి... ఏదో ఒక సమస్య మా కుటుంబానికి వస్తూనే ఉండేది. చిన్న వయసులోనే మా నాన్నగారు తల్లిని కోల్పోయారు. ఆపై మెల్లిమెల్లిగా పాలిటిక్స్ లోకి వచ్చి కోలుకున్నారు.
ఆపై నాలుగు సంవత్సరాల వ్యవధిలో ముగ్గురు అన్నలనూ కోల్పోయారు అధ్యక్షా... ఆ సందర్భంలో మా కుటుంబ సభ్యులు వచ్చి ఆస్తులు పంచాలని అడిగితే, ఆస్తి కావాలంటే తీసుకోండి. 'మా అన్న పిల్లలను నాకు ఇవ్వండి, నేను పెంచుకుంటాను' అని ఆరోజు మా నాన్నగారు అనడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఆయన పెద్దన్న పిల్లలను కూడా మాతో సమానంగా పెంచారు" అని తండ్రితో తమకున్న అనుబంధాన్ని అఖిలప్రియ గుర్తు చేసుకున్నారు. వారందరికీ పెళ్లిళ్లను తన తండ్రే చేశారని. ఇప్పటికి కూడా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అందరూ వచ్చి ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటామని అన్నారు. అసెంబ్లీలో అఖిలప్రియ ప్రసంగం కొనసాగుతోంది.