: మూడు రోజుల్లో మంత్రిని చేస్తానని హామీ ఇచ్చి, భూమాను మోసం చేసిన బాబు!: వైఎస్ జగన్
శాసనసభలోని తన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు. తమ పార్టీలోకి వచ్చిన మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపించిన చంద్రబాబు, ఆయన్ను తమ పార్టీకి దూరం చేశారని ఆరోపించారు. ఆపై ఇదిగో, అదిగో అంటూ చెప్పుకుంటూ వచ్చి, భూమా ఎంతో మానసిక ఆవేదనకు గురవడానికి కారణమయ్యారని నిప్పులు చెరిగారు. ఏడాది గడిచినా, ఆయనకు ఇచ్చిన మంత్రిపదవి హామీని చంద్రబాబు నిలుపుకోలేదని, అదే ఆయన్ను నిత్యమూ కుంగదీసేదని అన్నారు. ఇప్పుడు కూడా భూమా మృతిపై సంతాప తీర్మానాన్ని తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు.