: అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం


ఈ ఉదయం అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.9గా నమోదయింది. ఉదయం 8.21 గంటల సమయంలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంప కేంద్రం నికోబార్ ద్వీప సమూహంలో పది కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైందని చెప్పింది. అయితే, ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం ఏమైనా వాటిల్లిందా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని అధికారులు తెలిపారు. మరోవైపు, జమ్ముకశ్మీర్ లో కూడా ఈ ఉదయం 3.6 తీవ్రతతో చిన్నపాటి భూకంపం వచ్చింది.    

  • Loading...

More Telugu News