: భూమా మరణానికి చంద్రబాబు టార్చరే కారణం: వైసీపీ ఎమ్మెల్యే రాజా
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆరోపించారు. చంద్రబాబు టార్చర్ వల్లే ఆయన చనిపోయారని అన్నారు. భూమా మృతికి కారణమైన వ్యక్తులతో కలసి సంతాప తీర్మానంలో పాల్గొనడం ఇష్టంలేకే ఈ రోజు అసెంబ్లీకి వైసీపీ సభ్యులు వెళ్లలేదని ఆయన తెలిపారు. చాలా మందికి మంత్రి పదవిని ఆశగా చూపిన చంద్రబాబు... వారందరినీ ఆవేదనకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు.