: మోదీ గురించి అమెరికా విశ్లేషకులు ఏమంటున్నారంటే..!


ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఎక్స్ పర్ట్స్ కూడా మోదీపై విశ్లేషణ చేశారు. 2019 ఎన్నికల్లో కూడా మోదీనే ఫేవరేట్ అని వారు తేల్చేశారు. మరో టర్మ్ ప్రధానమంత్రి మోదీనే అని వారు చెబుతున్నారు. 2014లో వచ్చిన ఎన్నికల ఫలితాలు అసహజంగా వచ్చినవి కాదనే విషయాన్ని తాజా అసెంబ్లీ ఫలితాలు వెల్లడిస్తున్నాయని ఓ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.

గతంలో ఎస్పీ, బీఎస్పీ సాధించిన విజయాల కంటే ఇప్పటి విజయం చాలా పెద్దదని మరో విశ్లేషకుడు జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు ఆడం జీగ్ ఫెల్డ్ తెలిపారు. బీజేపీ చాలా క్రమశిక్షణతో ఒక్కో రాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తూ, లబ్ధి పొందుతోందని... ప్రతిపక్షాలు ఆ పని చేయలేకపోతున్నాయని మరో విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News