: కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా శశిథరూర్.. ఆన్ లైన్ లో జోరుగా ప్రచారం
కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ను 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ఆన్ లైన్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని కేరళ తిరువనంతపురానికి చెందిన ఒక వ్యక్తి ప్రారంభించారు. శశిథరూర్ అత్యున్నత విద్యార్హతలు కలిగిన వ్యక్తి అని... జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో ఆయనకు ఉన్న పరిజ్ఞానం అమోఘమని... ప్రపంచ స్థాయి నాయకులతో ఆయనకు మంచి సంబంధాలున్నాయని సదరు వ్యక్తి పేర్కొన్నారు. దేశ ప్రజలలో కూడా శశిథరూర్ కు మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఆయన ఆన్ లైన్ పిటిషన్ కు ఇప్పటి వరకు 6,821 మంది నెటిజన్లు మద్దతు పలికారు.