: అఖిలప్రియ ఫోన్ చేసి లోకేష్ కు చెప్పారు... ఆపైనే నాకు తెలిసింది: చంద్రబాబు


ఆదివారం ఉదయం భూమా అస్వస్థతకు గురైన తరువాత, ఆయన కుమార్తె అఖిలప్రియ, విషయాన్ని పార్టీ కార్యదర్శి లోకేష్ కు ఫోన్ లో తెలియజేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆపై లోకేష్ తనతో మాట్లాడుతూ, "భూమా నాగిరెడ్డిగారికి చాలా సీరియస్ గా ఉంది" అని చెప్పాడని అన్నారు. ఆ వెంటనే, ఎటువంటి సాయం కావాలన్నా వెంటనే చేయాలని తాను పేషీకి ఆదేశాలు ఇచ్చానని అన్నారు. ఆరోగ్యమంత్రి కామినేని శ్రీనివాస్ ను అలర్ట్ చేశానని, ఏ విధంగానైనా ఆయన్ను కాపాడాలని కోరానని అన్నారు. కానీ, దురదృష్టవశాత్తూ అలా జరిగిపోయిందని చెప్పారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా ప్రత్యేక ముద్ర వేశారని కొనియాడారు. ఉజ్వల భవిష్యత్తున్న నేతగా భూమాను చూసుకునేవాడినని, ఆయన 53 సంవత్సరాలకే కానరాని లోకాలకు చేరడం ఎంతో బాధను కలిగిస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News