: యూపీ అసెంబ్లీలో కోటీశ్వరులు.. విజయ వీరుల్లో 80 శాతం మంది వారే!
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ప్రజలు కాషాయ పార్టీకి బంపర్ మెజారిటీతో విజయాన్ని కట్టబెట్టారు. అయితే గెలిచిన అభ్యర్థుల్లో 80 శాతం మంది కోట్లకు పడగలెత్తినవారే కావడం గమనార్హం. గత అసెంబ్లీలో 67 శాతం మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులుంటే ఈసారి అది 13 శాతం పెరిగిందని ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇక కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేల్లో 79 శాతం మంది కోటీశ్వరులే. సమాజ్‌వాదీ పార్టీలో 85 శాతం, బీఎస్పీలో 95 శాతం, కాంగ్రెస్‌లో 91 శాతం మంది కోటీశ్వరులున్నారు. బీఎస్పీ ఎమ్మెల్యేలు షా అలాం రూ.118 కోట్లు, వినయ్‌శంకర్ రూ.67 కోట్లు, బీజేపీ ఎమ్మెల్యే రాణి పక్షైలికా సింగ్ రూ.58 కోట్ల ఆస్తులతో తొలి మూడు స్థానాలను ఆక్రమించారు.