: టాలీవుడ్ టాప్ స్టార్స్ భూమాకు మంచి మిత్రులు!
రాయలసీమలో మంచి పట్టు ఉన్న టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన అంత్యక్రియలు ముగిశాయి. అయితే, భూమా నాగిరెడ్డి కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమతోనూ ఆయనకు అనుబంధం ఉంది. టాలీవుడ్ లోని ప్రముఖ నటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఆయనకు మంచి మిత్రులు. మరో సీనియర్ నటుడు మోహన్ బాబుతో భూమా కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దర్శకులు రాఘవేంద్రరావు, తమ్మారెడ్డి భరద్వాజతో కూడా ఆయన సన్నిహితంగా ఉండేవారు. వీరబ్రహ్మేంద్ర కంబైన్స్ మూవీ క్రియేషన్స్ సంస్థ పేరుతో భూమా పలు చిత్రాలను నిర్మించారు. తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో ‘నా కూతురు’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన భూమా, సుమన్ కథానాయకుడిగా నటించిన చిత్రాలకు ప్రొడ్యూసర్ గా ఉన్నారు.