: ప్రధాని మోదీకి అబుదాబి యువరాజు అభినందనలు
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మన దేశంలోని పలువురు ప్రముఖులు, దేశాధి నేతల నుంచి ప్రధాని మోదీకి అభినందనలు అందుతున్నాయి. తాజాగా, అబుదాబి యువరాజు షేమ్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యన్, కెనడా మాజీ ప్రధాన మంత్రి స్టీఫెన్ హర్పర్ మోదీకి శుభాకాంక్షలు పంపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.