: ఆత్మహత్య చేసుకుని ఫేస్ బుక్ లో పోస్టు చేసిన జేఎన్యూ ఎంఫిల్ విద్యార్థి రజనీ క్రిష్
మరో విద్యాకుసుమం నేలరాలింది.... ఉన్నత విద్యావంతుడైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడడంతో ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మరోసారి వార్తల్లో నిలిచింది. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఢిల్లీ జవహర్ లాల్ యూనివర్సిటీలో ఎంఫిల్ చేస్తున్న విద్యార్థి రజనీ క్రిష్ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. ఆత్మహత్య చేసుకున్న వీడియోను లైవ్ స్ట్రీమ్ చేసిన రజనీ క్రిష్... తన హాస్టల్ రూంలో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. జేఎన్యూ అడ్మిషన్లలో సమానత్వం పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన రజనీ క్రిష్ ఆత్మహత్యకు పాల్పడడం షాక్ కు గురి చేసింది. కాగా, రజనీ క్రిష్ తమిళనాడులోని సేలంకు చెందిన వాడు.