: 'కాటమరాయుడు' సెట్లో సరదా సీన్స్.. పవన్-అలీల నవ్వులాట!
ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘కాటమరాయుడు’ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియోలో షూటింగ్ సందర్భంగా పవన్ కల్యాణ్, అలీ మధ్య చోటుచేసుకున్న సరదా సంఘటనలను ఉంచారు. ఈ వీడియో ఆద్యంతము పవన్ కల్యాణ్ నవ్వులు చిందించడం విశేషం. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సందర్భంగా అలీ మీద పవన్ సరదాగా కత్తి దూశారు... దానిని అలీ తనదైన శైలిలో కామెడీగా చేసేశాడు. కాగా, ఉగాదికి విడుదల కానున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తుండగా, పలువురు యువనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీటాన్ని అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు.