: మణిపూర్ సీఎంగా బీజేపీ నేత బీరెన్ సింగ్!


మణిపూర్ బీజేపీ శాసనసభా పక్షనేతగా ఎన్నికైన ఎన్.బీరెన్ సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ విషయమై చర్చించేందుకు గవర్నర్ నజ్మా హెప్తుల్లాను ఆయన కలవనున్నారు. ఇతర పార్టీలు, స్వతంత్రులు బీజేపీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. కాగా, మణిపూర్ సీఎం ఇబోబి సింగ్ తన పదవికి రేపు రాజీనామా చేయనున్నారు. కాగా, ఇటీవల జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాల్లో కాంగ్రెస్ 28, బీజేపీ 21, టీఎంసీ 1, ఇతరులు పది స్థానాల్లో విజయం సాధించారు.  

  • Loading...

More Telugu News