: గ్రామానికి మంచి జరగాలని పిడిగుద్దులాట!
గ్రామానికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఆ గ్రామంలో పిడిగుద్దులాట క్రీడను నిర్వహిస్తుంటారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సా గ్రామంలో ప్రతి ఏటా హోలి నాడు సంప్రదాయబద్దంగా ఈ క్రీడను నిర్వహిస్తారు. గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద ప్రజలు అందరూ గుంపుగా చేరి పిడిగుద్దులాటలో పాల్గొంటారు. ప్రతి ఏటా హోలి నాడు ఈ క్రీడను నిర్వహించడం ఆనవాయితి అని, ఈ క్రీడలో గాయపడ్డవారు కాముని దహనం చేసిన బూడిదను రాసుకుంటారని గ్రామస్తులు తెలిపారు.