: మోదీని పొగడడమా?: చిదంబరంపై నిప్పులు చెరిగిన వీహెచ్!


మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో మోదీకి తిరుగుండదంటూ చిదంబరం వ్యాఖ్యానించడంపై వీహెచ్ మండిపడ్డారు. కార్తీ చిదంబరం అవినీతి ఆరోపణల్లో ఇరుక్కోవడంతో చిదంబరం మోదీని కీర్తిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇలాంటి క్రమశిక్షణారాహిత్యాన్ని సహించకూడదని ఆయన సూచించారు. చిన్న తప్పు అయినా కఠిన శిక్షలు విధించాలని అధిష్ఠానానికి సూచించారు.

చిదంబరం ఇలాంటి వ్యాఖ్యలు ఏవైనా చెయ్యాలనుకుంటే పార్టీ వేదికలపై చెప్పాలని సూచించారు. అలా కాకుండా బాధ్యతాయుతమైన వ్యక్తులు బహిరంగ వేదికలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. చిదంబరంపై అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కార్తీ చిదంబరం కూడా పార్టీ అధిష్ఠానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడని ఆయన మండిపడ్డారు. చూస్తూ ఊరుకుంటే ప్రతి ఒక్కరూ ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారని ఆయన అన్నారు. 

  • Loading...

More Telugu News