: డ్రగ్స్ మత్తులో ఫ్రెండ్స్ తో కలిసి భార్యపై అఘాయిత్యానికి పాల్పడ్డ భర్త!
డ్రగ్స్ మత్తులో ఫ్రెండ్స్ తో కలిసి ఓ భర్త తన భార్యపై అఘాయిత్యానికి పాల్పడిన దారుణ సంఘటన హైదరాబాద్ లో జరిగింది. పాతబస్తీలోని కంచన్ బాగ్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. తన మిత్రులకు సుఖాన్ని పంచాలంటూ భార్యను నిత్యం వేధిస్తుండటంతో బాధితురాలు కంచన్ బాగ్ పోలీసులను ఆశ్రయించింది. తన భర్త సలీం ఆగడాలపై బాధితురాలు ఈ మేరకు ఫిర్యాదు చేసింది. తన న్యూడ్ ఫొటోలు, వీడియోలను సలీం షేర్ చేసే వాడని, వారితో సెక్స్ లో పాల్గొనాలని తనపై ఒత్తిడి తెచ్చేవాడని ఆ ఫిర్యాదులో ఆరోపించింది. ఈ విషయాన్ని తన అత్తకు చెబితే, సోషల్ స్టేటస్ కోసం ఇటువంటివి సాధారణమేనని ఆమె కొట్టి పారేసిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో బాధితురాలి భర్తను, అత్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.