: మార్స్ మీద జీవం.. నాసా నిజం దాస్తోందా?


నాసా క్యూరియాసిటీ రోవర్‌ తీసిన అంగారక గ్రహం చిత్రాల్లో రాళ్ల మధ్య ఓ ఉడత కనిపిస్తోందని 'ది యూఎఫ్‌ఓ సైటింగ్‌ డైలీ వెబ్‌ సైట్‌' పరిశోధకులు తెలిపారు. తాజాగా ఈ వెబ్‌ సైట్‌ విడుదల చేసిన నాసా చిత్రంలో రెండు రాళ్ల మధ్య ఓ ఉడుత కనిపిస్తోంది. దాని చెవులు, ముక్కు, కళ్లు, ముందు కాళ్లు స్పష్టంగా కనిపిస్తుండడం విశేషం. దీంతో అంగారకుడిపై జీవం ఉందన్న విషయాన్ని నాసా ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతోందని వారు ఆరోపించారు. నాసా ఈ విషయాన్ని ఎంత దాస్తున్నప్పటికీ నాసా విడుదల చేస్తున్న ఫోటోల్లో అంగారకుడిపై జీవం ఉందని చాటి చెప్పే ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయని వారు పేర్కొన్నారు.

అయితే, ఈ ఉడుత అంగారక గ్రహంపై పుట్టిన ఉడుతా? లేక ప్రయోగాలలో భాగంగా నాసా భూమిపైనుంచి పంపిన ఉడుతా? అన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేశారు. జంతు హక్కుల సంఘాలు ఆందోళన చేస్తాయన్న కారణంతో జంతువులను వినియోగిస్తూ, నాసా వివిధ రహస్య ప్రయోగాలను నిర్వహిస్తుంటుందని ఈ వెబ్ సైట్ నిర్వాహకులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News